Vijay Devarakonda : విలన్ గా విజయ్ దేవరకొండ

వైవిధ్యమైన పాత్రలతో హీరోగా అదరగొడుతున్నాడు విజయ్ దేవరకొండ. కానీ సరైన విజయాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం కింగ్ డమ్ పూర్తి చేసి ఉన్నాడ. తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జగన్నాథమ్ మూవీ చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మించే సినిమా ఇది. ఆపై రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పీరియాడిక్ మూవీ లైన్ లో ఉంది. ఈ మూడు సినిమాలతో విజయ్ దేవరకొండ టైర్ 1లోకి వస్తాడు అనే టాక్ కూడా ఉంది. కింగ్ డమ్ ఆగస్ట్ 31న విడుదల కాబోతోంది.
హీరోగా రెండు సినిమాలు చేస్తూనే ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ గా నటించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అది కూడా బాలీవుడ్ లో. యస్.. ఫరాన్ అక్తర్ డైరెక్షన్ లో రూపొందిన డాన్, డాన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో చివరి చిత్రంగా డాన్ 3 రూపొందించబోతున్నాడు ఫర్హాన్. ఫస్ట్ రెండు భాగాల్లో నటించిన షారుఖ్ ఖాన్ థర్డ్ పార్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రణ్‌వీర్ సింగ్ తో డాన్ 3 చేయబోతున్నాడు ఫర్హాన్. ఈ మూవీలో హీరోతో పాటు విలన్ పాత్రకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రలో మొదటగా విక్రాంత్ మాస్సేను తీసుకున్నారు. ఏమైందో అతను తప్పుకున్నాడు. ఆ స్థానంలో విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారు అనేదే ప్రస్తుతం హాట్ గా వినిపిస్తోన్న టాక్.
అర్జున్ రెడ్డి, లైగర్ తో విజయ్ బాలీవుడ్ వారికీ బాగా తెలుసు. పైగా అతని యాటిట్యూడ్ ఇక్కడ మైనస్ అయినా అక్కడ ప్లస్ అయింది. సో.. నిజంగా అతను డాన్ 3లో విలన్ గా చేస్తే బాలీవుడ్ కే మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ విలన్ అనిపించుకుంటాడు అని చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com