Vijay Devarakonda : వీడీ11 సెట్‌లో హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు..!

Vijay Devarakonda : సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను వీడీ 11 మూవీ సెట్‌లో జరుపుకున్నారు. చిత్ర బృందం సమక్షంలో విజయ్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూనిట్ అంతా ఆయనకు విశెస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివనిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా 16 రోజుల కాశ్మీర్ షూట్ గ్లింప్స్ వీడియోతో చిత్ర యూనిట్ మరో ప్రకటన చేశారు. సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటోంది. తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్: బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com