Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం ఏంటి?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం ఏంటి?
Vijay Devarakonda: 'లైగర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఊళ్లన్నీ చుట్టేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి విజయ్‌ని ప్రశ్నిస్తూ కెరీర్ మొదట్లో మీతో చాలా ఫ్రీగా మాట్లాడాను..

Vijay Devarakonda: 'లైగర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఊళ్లన్నీ చుట్టేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి విజయ్‌ని ప్రశ్నిస్తూ కెరీర్ మొదట్లో మీతో చాలా ఫ్రీగా మాట్లాడాను.. ఇప్పుడు మాట్లాడాలంటే కాస్త బెరుగ్గా ఉంది అని అన్నారు. దాంతో విజయ్ అతడిలోని భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తూ.. అవన్నీ పట్టించుకోవద్దు.. మనం సరదాగా మాట్లాడుకుందాం. మీరూ కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి.. నేను కూడా అలానే కూర్చుంటా అని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కాళ్లుపెట్టి మరీ మాట్లాడారు.. దీంతో విజయ్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. పాన్ ఇండియా స్టార్ అయ్యేసరికి పొగరెక్కువైంది.. మర్యాద లేదు.. ఏం లేదు అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు.

టీవీ 5 జర్నలిస్టు దీనికి వివరణ ఇచ్చారు. విజయ్ ఎప్పుడూ సరదాగా ఉంటారు.. హీరోని అన్న ఇగో ఇసుమంతైనా ఉండదు. ఆయనతో మాట్లాడడం మాక్కూడా చాలా హాపీగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. పై స్థాయి వారు, కింది స్థాయి వారు అని భేషజాలకు పోరు. ఆయన విలేకరిలో ఉన్న మొహమాటాన్ని, భయాన్ని పోగొట్టే ప్రయత్నంలో అలా చేశారే తప్ప కావాలని చేయలేదు.. దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దు అని చెప్పుకొచ్చారు.

దీనిపై స్సందించిన విజయ్.. చిల్లవ్వండి.. నేను చాలా కూల్ అండి.. అంటున్నాడు.. ఎందుకండి.. ఏవేవో అర్థాలు తీస్తారు.. ఏవేవో ఊహించుకుంటారు.. ఎదుగుతున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మర్చిపోకూడదు. అదే మనకి నలుగురిలో మంచి పేరు తెచ్చి పెడుతుంది. పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన మీ విజయ్ దేరకొండని కాకుండాపోను.. మన పని మనం చేసుకుని పోతున్నా టార్గెట్ చేసేవాళ్లు కొందరుంటారు. వాటిపై తిరిగి పోరాటం చేస్తూనే ఉండాలి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, దేవుని దయ మిమ్మల్ని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాయి అని తెలపడంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది.

https://twitter.com/i/status/1560268481097920513

Tags

Read MoreRead Less
Next Story