Vijay Devarakonda: తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడం..: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడం..: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: విజయం కూడా ఒక్కోసారి కిక్కివ్వకపోవచ్చు. అయినా ఫెయిల్యూర్స్ వస్తేనే కదా తామేంటో తెలుసుకునే అవకాశం వస్తుంది ఎవరికైనా.

Vijay Devarakonda: విజయం కూడా ఒక్కోసారి కిక్కివ్వకపోవచ్చు. అయినా ఫెయిల్యూర్స్ వస్తేనే కదా తామేంటో తెలుసుకునే అవకాశం వస్తుంది ఎవరికైనా. తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయితే దర్శకులకు కానీ, నటీనటులకు కానీ సినిమా అంటే బోర్ కొట్టేస్తుందేమో.. అందుకే అప్పుడప్పుడు ఫ్లాపులు కూడా వస్తుంటాయి.


వాటినుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రేక్షకుల నాడి తెలుసుకుంటారు. మంచి సినిమాలు తీస్తారు, తామేంటో నిరూపించుకుంటారు. ఫ్లాప్ వచ్చిందని కృంగిపోతే ముందుకు వెళ్లడం కష్టం.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు మరెక్కడైనా.. ఇదే విషయాన్ని విజయ్ వివరించాడు ఎన్నో హోప్స్ పెట్టుకుని నటించిన లైగర్ ఫ్లాప్ గురించి మాట్లాడుతూ..


ఇలాంటి పెద్ద సినిమాల్లో నటించడమే గొప్ప అవకాశం.. అందులో పోషించిన నత్తి పాత్రను ఆస్వాదించానని అన్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ కోసం దేశంలోని అన్ని ప్రాంతాలు చుట్టి రావడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు. లైగర్ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశానన్నారు.


కానీ ఫలితం దక్కలేదు. తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమని, ఒకవేళ ఎవరైనా తప్పు చేయట్లేదంటే వారు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించనట్టే అని వివరించారు. సక్సెస్ వచ్చినా రాకపోయినా ప్రయత్నాన్ని విరమించకూడదన్నారు. అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయంలోనూ ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. జీవితంలో జయాపజయాలు సహజమని అన్నారు.

ప్రస్తుతం విజయ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషిలో నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. యువ దర్శకులు కొత్త కథలతో విజయ్‌ని సంప్రదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story