Vijay Devarakonda : కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయినట్టేనా..?

Vijay Devarakonda :  కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయినట్టేనా..?
X

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్నఈ చిత్రాన్ని సితార ఎంటర్ట్మైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్, రీసెంట్ గా వచ్చిన పాట మూవీపై అంచనాలను డబుల్ చేశాయి. అనిరుధ్ సంగీతం కింగ్ డమ్ కు హైలెట్ కాబోతోందని టీజర్ తోనే తేలిపోయింది. ఇక ఈ నెల 30న విడుదల కాబోతోన్న ఈ మూవీపై ఓ రేంజ్ లో రూమర్స్ వస్తున్నాయి. సినిమా పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్. మరి నిజంగా పోస్ట్ పోన్ అయిందా.. లేక ఇవన్నీ రూమర్సేనా అంటే.. ఆల్మోస్ట్ వాయిదా పడినట్టే అంటున్నారు.

కింగ్ డమ్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది. ప్యాన్ ఇండియా రిలీజ్ అంటే కలెక్షన్స్ కష్టం అవుతాయి. అందుకే కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారట. తర్వాత అంటే ఎప్పుడూ.. అంటే.. జూలైలో రావొచ్చు అంటున్నారు. అప్పటికి వర్షాలు పెరుగుతాయి. అయినా కలెక్షన్స్ వర్షం కూడా కురిపించే కంటెంట్ మా సినిమాలో ఉందనేది వీరి నమ్మకం. ఏదేమైనా ఓ ఇరవై రోజుల్లో విడుదల కాబోతోన్న మూవీపై పోస్ట్ పోన్ అనే న్యూస్ ఊరికే రావు. ఒకవేళ ఇవి నిజంగా రూమర్స్ అయితే మాత్రం మూవీ టీమ్ ఎంత త్వరగా ఖండిస్తే అంత మంచిది.

Tags

Next Story