Kingdom : కింగ్ డమ్ తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ కొట్టేసిన విజయ్

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన కింగ్ డమ్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కింగ్ డమ్ పై భారీ అంచనాలున్నాయి. విజయ్ పై సింపతీ కూడా పెరిగింది. ప్రమోషన్స్ లో మనోడు బాగా తగ్గి కనిపించాడు. ఈవెంట్స్ లో సైతం ఇంతకు ముందులా నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాడు. దీంతో విజయ్ హిట్ పడాలి అనుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఓ రేంజ్ లో కనిపించాయి. దీంతో ఫస్ట్ ఓపెనింగ్స్ లో విజయ్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ పడ్డాయి.
తెలుగు స్టేట్స్ లోనే ఈ మూవీ 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇక ఈ వీకెండ్ లో కీలకంగా మారబోతోంది. పాజిటివ్ టాక్ తో పాటు కొంత మిక్స్ డ్ టాక్ కూడా ఉంది సినిమాపై అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే నాన్ హాలిడే రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం కూడా ఆశ్చర్యమే. మొత్తంగా విజయ్ దేవరకొండకు ఓ హిట్ పడబోతోంది అనేలా ఉన్నాయి ఈ కలెక్షన్స్. వీకెండ్ లో కూడా గురువారం నాటి ట్రెండ్ కనిపిస్తే ఈజీగా వంద కోట్లు దాటేస్తుంది అని చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com