టాలీవుడ్ రౌడీ కొత్త గిఫ్ట్.. మమ్ములు మస్తు ఖుషీ..

సినిమావారు కేవలం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు బిజినెస్‌లు చేయడంలో కూడా తమ సత్తాను చాటుకుంటున్నారు.ట్రెండింగ్ ఉన్న వ్యాపారాలలో అడుగుపెట్టి అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నాడు. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. ఇప్పటికే ఈ హీరో రౌడీ వేర్ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్‌లో అడుగుపెట్టాడు.
అంతే కాకుండా సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి కొత్త టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చే పనిలో పడ్డాడు. తాజాగా మరో ట్రెండింగ్ బిజినెస్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు విజయ్. అదే మల్టీప్లెక్స్. ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ ఇప్పటికే థియేటర్‌ను ప్రారంభించాలి అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ) మల్టీప్లెక్స్‌కు ఓపెనింగ్ చేసాడు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ వల్లే సినిమాల్లో పరిచయమయిన విజయ్ తాను డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీని మొదటిగా తన థియేటర్‌లో రిలీజ్ చేసి డైరెక్టర్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అయితే ఈ థియేటర్ తన తల్లికి పుట్టినరోజున బహుమతిగా ఇస్తున్నానంటూ థియేటర్లో నిలబడి ఉన్న తన తల్లి ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసాడు విజయ్. దానికి 'హ్యాపీ బర్త్ డే మమ్ములు. ఈ ఏవీడీ నీకోసం. నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతా. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా' అని క్యాప్షన్ కూడా పెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com