Vijay Devarakonda : అందుకే నేను చెప్పులేసుకుంటున్నా : విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : అందుకే నేను చెప్పులేసుకుంటున్నా : విజయ్ దేవరకొండ
Vijay Devarakonda : లైగర్ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండ రూ.200ల విలువ చేసే సాధారణ చెప్పులు వేసుకుంటున్నారు

Vijay Devarakonda : లైగర్ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండ రూ.200ల విలువ చేసే సాధారణ చెప్పులు వేసుకుంటున్నారు. దీనికి రకరకాల కారణాలను సినీమీడియాలో చర్చించారు. కొందరు ప్రమోషన్ చేయడం ఎందుకని, ఇంకొందరు మాస్ లుక్ కోసం అని అభిప్రాయపడ్డారు. అయితే విజయ్ దేవరకొండే స్వయంగా దీనికి సమాధానమిచ్చారు. 'షూస్ లేదా ఇతర ఫుట్‌వేర్ డ్రెస్‌కు తగ్గట్లు సెట్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అదే చెప్పులయితే క్షణాల్లో అయిపోతుంది. లైగర్ ప్రమోషన్స్‌లో ఇప్పుడు నేను డ్రస్సింగ్‌కి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నాను' అని విజయదేవరకొండ కంక్లూజన్ ఇచ్చారు.

లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. అనన్యపాండే హీరోయిన్‌గా, రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూరీజగన్నాద్ డైరెక్షన్‌లో కరణ్‌జోహర్ దీనికి తెరకెక్కిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story