Vijay Devarakonda : కింగ్ డమ్ ముందు పెద్ద టార్గెటే ఉంది

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్ విడుదలకు దగ్గరవుతోంది. సితార బ్యానర్ లో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదల కాబోతోంది. సితార బ్యానర్ లో ఇంత హడావిడీగా విడుదలవుతోన్న సినిమా ఇదే అనుకోవచ్చేమో. ప్రమోషన్స్ కు అస్సలేమాత్రం టైమ్ లేకుండానే విడుదలవుతోంది. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మంచి స్పందనే వచ్చింది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తాయి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అసలే విజయ్ పై విపరీతమైన నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు కొందరు. వారు కూడా కింగ్ డమ్ కోసం కాచుకున్నారు.
ఇక ఈ మూవీ బిజినెస్ పరంగా చూస్తే పెద్ద టాస్కే ఉంది. దాదాపు 100 కోట్ల వరకూ వసూలు చేయాల్సిన టార్గెట్ తో విడుదలవుతోంది. షేర్ పరంగా చూస్తే 60 కోట్ల వరకూ కలెక్ట్ చేయాలి. అంటే బ్లాక్ బస్టర్ టాక్ ఖచ్చితంగా రావాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. కొన్నాళ్లుగా విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాంబ్ అవుతున్నాయి. అందుకే ఇది పెద్ద టాస్క్ గా మారుతోంది. నిర్మాత మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడీ చిత్రంపై. దర్శకుడు గౌతమ్ ఇప్పటి వరకూ చేసిన మళ్లీరావా, జెర్సీ చిత్రాలతో పోలిస్తే ఇందులో వయొలెన్స్ ఎక్కువగా ఉంది. అది కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అలాగే ఎమోషన్స్ కూడా పండాలి.
మొత్తంగా విజయ్ దేవరకొండ 100 కోట్లకు పైగా వసూలు చేయాలనే టార్గెట్ తో వస్తోన్న కింగ్ డమ్ ఆ ఫిగర్ ను చేరుతుందా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com