Vijay Devarakonda : రణబాలి టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన

Vijay Devarakonda :  రణబాలి టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన
X

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో "రణబాలి" టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సాధించబోయే సక్సెస్ కు టైటిల్ గ్లింప్స్ కు వస్తున్న స్పందనే ఫస్ట్ స్టెప్ గా మూవీ టీమ్ భావిస్తోంది.

ఈ సినిమా గ్లింప్స్ లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు మెస్మరైజ్ చేసింది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఎంచుకున్న కథా నేపథ్యం, ప్యాషనేట్ మేకింగ్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ టైటిల్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచాయి. జయమ్మగా రశ్మిక మందన్న ఆకర్షించింది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రణబాలి" సినిమా రూపొందుతోంది.

Tags

Next Story