మళ్లీ రూమర్లు..! తగ్గేదేలే అంటున్న రష్మిక, విజయ్

మళ్లీ రూమర్లు..! తగ్గేదేలే అంటున్న రష్మిక, విజయ్
ఈ ఏడాది చివర్లో వీరు పెళ్లి చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి


టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ప్రేమ చిగురించినట్లు పలుమార్లు రూమర్లు వ్యాపించాయి. గతంలోనే వాటన్నింటిని ఇరువురూ కొట్టిపడేశారు. అయితే వీరిద్దరి ఫ్యామిలీలు, స్నేహితులతో గడిపిన క్షణాలు మాత్రం బయట పడుతూనే ఉన్నాయి. రూమర్లకు ప్రాణం పోస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్, రష్మిక కలిసి స్నేహితులతో ఓ కేఫ్ లో ఫన్ టైం ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ మీటింగ్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు తిన్నసూరి, షెరియా వర్మలు కూడా ఉన్నారు.

విజయ్ రష్మికల రిలేషిన్ షిప్ రూమర్స్ కొత్తకాదు. వీరు కలిసి విహార యాత్రలు చేసిన ఫొటోలు, విమానాశ్రయాలలో కలిసి ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించినప్పుడు కూడా ఇద్దరి ఫొటోలు ఒకే బ్యాంక్ గ్రౌండ్ లో విడివిడిగా ఉన్నాయి. వీటిని విజయ్, రష్మికలే తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేసుకుని రూమర్స్ కు ప్రాణం పోశారు.

ప్రస్తుతం రూమర్స్ రాకెట్ల లా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరు పెళ్లి చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ఊహాగానాలను విజయ్ కొట్టిపడేశాడు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగానే రూమర్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్, గీతా గోవిందం వంటి చిత్రాలలో వీరిద్దరు కలిసి పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story