Vijay Deverakonda: పవర్ స్టార్ రికార్డును బ్రేక్ చేసిన రౌడీ హీరో..

Vijay Deverakonda: ఒక్క సినిమాతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన విజయ్.. హీరోగా నటించిన మొదటి సినిమా 'పెళ్లిచూపులు' నుండే ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేశాడు. ఇక టాలీవుడ్ సినిమాలకు గేమ్ చేంజర్‌లాంటి అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ సాధించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఇతర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు.
హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. అప్పుడే పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించే రేంజ్‌కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాధ్‌లాంటి డాషింగ్ డైరెక్టర్‌తో కలిసి 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఏ సినిమాను అయినా వేగంగా ఫినిష్ చేసే పూరీ.. లైగర్ విషయంలో మాత్రం అలా తొందరపడట్లేదు. ఈ సినిమాలో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే రెండు సంవత్సరాలుగా ఇంకా లైగర్ షూటింగ్ దశలోనే ఉంది.
తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్‌గా లైగర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండనే హైలెట్‌గా నిలిచాడు. 'ఆగ్ లగా దేంగే' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా లైగర్ గ్లింప్స్ విడుదలయిన 24 గంటల్లోనే 15.92 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ గ్లింప్స్ 24 గంటల్లో ఇండియాలోనే అత్యధికంగా చూసిన గ్లింప్స్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. భీమ్లా నాయక్ గ్లింప్స్‌కు 24 గంటల్లో 8.49 వ్యూస్ వచ్చాయి. లైగర్‌కు మాత్రం 24 గంటల్లో ఏకంగా 15.92 మిలియన్ల వ్యూస్ రావడంతో పవర్ స్టార్ రికార్డును రౌడీ హీరో బ్రేక్ చేశాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్‌కు లైగర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com