Vijay Deverakonda: 8 సంవత్సరాల క్రితం నా పేరు కూడా మీకు తెలియదు: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

Vijay Deverakonda: అర్జున్ రెడ్డిగా యూత్ ని అట్రాక్ట్ చేసి అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. మంచి జోరు మీద ఉన్న విజయ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తో లైగర్ పూర్తి చేశాడు.. ప్రస్తుతం సమంతతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి తాత్కాలికంగా VD11 అని పేరు పెట్టింది చిత్ర యూనిట్.
సోమవారం (మే 9), నటుడు VD11 సెట్స్‌లో తన పుట్టినరోజును జరుపుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా అతడికి అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు విజయ్ దేవరకొండ తన అభిమానులకు ప్రత్యేక పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, నటుడు తన తల్లి మాధవి దేవరకొండతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దానికి కృతజ్ఞతా పూర్వకంగా కొన్ని వాఖ్యాలు జోడించాడు.
విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉద్దేశించి ఇలా రాసుకొచ్చాడు, "నా 15 సంవత్సరాల వయస్సులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన వ్యక్తికి - మీ ప్రేమ నన్ను వాటి పట్ల శ్రద్ధ చూపేలా చేసింది. 8 సంవత్సరాల క్రితం, మీకు నా పేరు, నా ఉనికి గురించి తెలియదు, ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తున్నారు, నాకు మద్దతు ఇస్తున్నారు.
మీలో చాలా మంది నాకు అనంతమైనప్రేమను అందిస్తున్నారు. నేను మీకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. అది మీకు మళ్లీ తిరిగి ఇవ్వబడుతుంది. ఏదో ఒక విధంగా మీ రుణం నేను తీర్చుకుంటాను. నేను మీ నుండి అనుభూతి చెందుతున్న ప్రేమ, మీరు నా నుండి అనుభూతి చెందుతారు. మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి అంటూ అభిమానులకు ప్రేమతో రాసిన ఆ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com