Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. వాటే లుక్

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ.. వాటే లుక్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ లుక్ చూస్తే విజయ దేవరకొండ నుంచి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ రాబోతోందని అర్థమయ్యేలా ఉంది. ఇప్పటి వరకూ విజయ్ ఇలాంటి ఫెరోషియస్ గెటప్ లో కనిపించలేదు అనే చెప్పాలి. వర్షం పడుతుండగా మొహమంతా రక్తంతో తడిసిపోయిన స్థితిలో విషాదంగా అరుస్తున్నట్టుగా ఉన్నాడు విజయ్. దీనికి క్యాప్షన్ గా ఇంగ్లీష్ లో ఇచ్చిన వర్డ్స్ చూస్తే ఈ సారి రక్తపాతమే అనేల ఉంది.

‘డెస్టినీ కాల్స్.. బ్లడ్ షెడ్ అవెయిట్స్... ఏ న్యూ కింగ్ షల్ రైజ్.. ’ అనే ఈ పదాలు చూస్తే.. ‘విధి పిలుస్తోంది.. రక్త పాతం ఎదురుచూస్తోంది.. ఓ సరికొత్త రాజు ఉదయించబోతున్నాడు..’ అనే అర్థాలుగా చూసుకోవచ్చు.

దీంతో పాటు అసలు మేటర్ ఏంటంటే.. ఈ మూవీని 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదీ అసలు విషయం. చాలామంది ఈ మూవీ ఈ డిసెంబర్ లో వస్తుందనుకుంటున్నారు. ఇప్పటికే డిసెంబర్ ఫుల్ ప్యాక్ అయింది. అందుకే వీళ్లు సమ్మర్ కు వెళ్లారు. సో.. ఈ సారి విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ ఓ రేంజ్ లో ఉండబోతోందనుకోవచ్చు.

Tags

Next Story