Thalapathy vijay : టార్చ్ బేరర్ లా వస్తోన్న విజయ్
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ వచ్చిన విజయ్ అన్ని భాషల్లోనూ ఫ్లాప్ నే చూశాడు. అతను త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గోట్ తర్వాత మరో సినిమా చేసి ఆపై పర్మనెంట్ గా కోలీవుడ్ కు బయ్ బయ్ చెప్పబోతున్నాడు. చివరి సినిమా 69వది. ఈ మూవీ తర్వాత ఇంక కొత్త సినిమాలు ఉండవు. కర్ణాటకకు చెందిన కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చివరి అవకాశాన్ని అందుకుంది. తెలుగు నుంచి కొందరు ట్రై చేశారు. బట్ ఇది కన్నడ నిర్మాతకు వెళ్లింది.
గోట్ డిజాస్టర్ తర్వాత విజయ్ ఇక 69వ సినిమా చేయడు. ఆ మూవీ రిజల్ట్ తో అతను బాగా డిజప్పాయింట్. ఇక నుంచి పార్టీ నిర్మాణంపైనే పూర్తి దృష్టి పెడతాడు అనే రూమర్స్ వచ్చాయి. అవన్నీ కట్ చేస్తూ నిన్న (శుక్రవారం) కేవీఎన్ బ్యానర్ విజయ్ ఫ్యాన్స్ తో ఒక వీడియో రిలీజ్ చేసి చివరి సినిమా గురించి మాట్లాడించింది. ఆ వీడియో చాలా ఎమోషనల్ గా ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. దాంతో పాటు 69వ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. ఫైనల్ గా ప్రకటన వచ్చింది.
కార్తీతో ఖాకీ, అజిత్ తో వలిమై, తునివు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. వినోద్ డైరెక్టర్ అని చాలా రోజుల క్రితమే చెప్పారు. గోట్ కు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ పెద్ద మైనస్ అయింది. అందుకే ఈ సారి అనిరుధ్ ను తీసుకున్నారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో వస్తోన్న మూవీ కాబట్టి ఈ సినిమా అతనికి రాజకీయంగా ఉపయోగపడే కథతో ఉంటుందని చాలామంది అనుకున్నారు. బట్ అలాంటిదేం ఉండదు అని హెచ్ వినోద్ చెప్పాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తోనే వస్తున్నాం.. ఫ్యాన్స్ కు ఫైనల్ మూవీ నెక్ట్స్ లెవల్ లో ఉండేలా తీస్తా అన్నాడు. కానీ ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే పొలిటికల్ కంటెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పోస్టర్ లోని క్యాప్షన్ ‘ The Torch bearer of Democracy is Arriving Soon’ అనే క్యాప్షన్ చూస్తే తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వస్తోన్న టార్చ్ బేరర్ అనే మాట పాలిటిక్స్ కు బాగా సూట్ అవుతుంది కదా. మొత్తంగా విజయ్ చివరి సినిమాపై అనుమానాలు తొలగిస్తూ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. విశేషం ఏంటంటే.. 2025 అక్టోబర్ రిలీజ్ అనే ప్రకటన కూడా ఉందీ పోస్టర్ లో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com