విజయ్ 'మాస్టర్' పాఠాలు.. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో..

విజయ్ మాస్టర్ పాఠాలు.. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో..
యాక్షన్ స్టార్ విజయ్ 'మాస్టర్' ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు.

తమిళ ఇళయదళపతి విజయ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి. అతడి ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండడంతో విజయ్‌కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. యాక్షన్ స్టార్ విజయ్ 'మాస్టర్' ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు.

ఆయన ఎంచుకున్న తారాగణం హీరో విజయ్ అయితే, విలన్ విజయ్ సేతుపతి.. ఇద్దరూ పోటీ పడి నటించారు. విజయ్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు.. క్యారెక్టర్‌ని ఇరగదీశాడు. ఇక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న మాళవిక పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. సినిమా కొంచెం సాగతీతగా అనిపించినా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

కాలేజీ ఫ్రొఫెసర్ విజయ్ పక్కా ఊర మాస్.. ఫుల్‌గా తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి కాలేజీకి వస్తుంటాడు. అతడి ధోరణి మేనేజ్‌మెంట్‌కి నచ్చకపోయినా స్టూడెంట్స్‌కి మాత్రం మాస్టారి క్లాసులు నచ్చుతాయి. ఈ నేపథ్యంలో కాలేజీలో ఎన్నికల గొడవలు.. ఈ తరుణంలో మాస్టర్ బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వేషన్ హోంకి పాఠాలు చెప్పడానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ విలన్ విజయ్ సేతుపతి రంగ ప్రవేశం. ఇద్దరికీ ఫైట్.. ఎవరు గెలుస్తారు.. అసలెందుకు గొడవ.. వీటికి సమాధానం బుల్లితెర మీద దొరకనుంది.

కరోనా భయం వెంటాడుతూనే ఉంది కొందరికి. అందుకే థియేటర్‌కి వెళ్లి మాస్టర్‌ని చూడాలన్న ఆసక్తిని మనసులోనే చంపేసుకున్న వారి కోసం ఫిబ్రవరి 12నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వస్తుంది. హ్యాపీగా పాప్ కార్న్ తింటూ 'మాస్టర్' చెప్పే పాఠాలు బుద్ధిగా వినేయొచ్చు.. కుటుంబసభ్యులందరూ కలిసి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story