Vijay : హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టులో ఊరట

Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అమెరికా నుంచి ఆయన బీఎండబ్ల్యూ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు . దీనికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడం పైన వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి తనపైన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన నిన్న(శుక్రవారం) విచారణ జరగగా, ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్తానం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా విజయ్ బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వ్యాపార పన్ను శాఖను ఆదేశించింది. ఈ కేసును ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com