Vijay: పదేళ్లుగా మీడియాకు దూరం.. కారణం బయటపెట్టిన విజయ్..

Vijay (tv5news.in)
Vijay: తమిళ హీరో విజయ్ కోలీవుడ్‌లో చాలా పాపులారిటీ ఉన్న నటుల్లో ఒకరు. విజయ్ నటించే చాలావరకు సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్‌గా నిలుస్తాయి. అందుకే ఇతర హీరోలలాగా విజయ్ కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాల వైపు అడుగులేశాడు. విజయ్ అప్‌కమింగ్ మూవీ 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ కోసం 10 సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు విజయ్. ఇన్నాళ్లకు మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నాడో కారణం కూడా బయటపెట్టాడు.
విజయ్.. తాను నటించిన సినిమాల ఈవెంట్లకు హాజరవుతూ.. అందరూ మోటివేట్ అయ్యేలాగా స్పీచ్‌లు ఇస్తుంటాడు. కానీ దాని తర్వాత సినిమా విడుదలయ్యే వరకు, సినిమా విడులదయిన తర్వాత కూడా ఎక్కడా కనిపించడు. ముఖ్యంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో, ప్రెస్ మీట్స్‌లో అస్సలు కనిపించడు. దీనికి కారణం ఏంటో ఇటీవల బయటపెట్టాడు విజయ్.
దాదాపు 10, 11 ఏళ్ల క్రితం విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడట. అందులో విజయ్ మాట్లాడిన విషయాలను వేరేలాగా అన్వయించుకొని పలు మీడియా సంస్థలు, వార్తా పత్రికలు ప్రచారం చేశాయట. అది చూసి తానే ఎలా మాట్లాడారా అని ఆశ్చర్యపోయారట. అంతే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా నువ్వు ఇలా మాట్లాడావా అని ప్రశ్నించారట. అయితే తాను అలా మట్లాడలేదని కుటుంబసభ్యులకు, స్నేహితులకు చెప్పుకోవచ్చు కానీ అందరికీ చెప్పడం కష్టం కదా అన్న ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లకు మీడియాకు దూరంగా ఉన్నారట విజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com