Vijay Sethupathi : మాస్ డైరెక్టర్ తో విజయ్ సేతుపతి, నయనతార

Vijay Sethupathi  :  మాస్ డైరెక్టర్ తో విజయ్ సేతుపతి, నయనతార
X

దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. తను ప్రధాన పాత్ర చేసినా, విలన్ గా కనిపించినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తో ఉంటాడు. ప్రతి సినిమాకూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాడు. ఈ యేడాది మహారాజతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా వచ్చిన విడుదల 2 కాస్త డిజప్పాయింట్ చేసినా నటుడుగా అతను ఎప్పట్లానే ది బెస్ట్ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకూ విజయ్ సేతుపతి ఎంచుకున్న కథలు, చేసిన నటన మాస్ గా కనిపించినా.. ఎప్పుడూ ఊరమాస్ గా లేదు. కొన్నిసార్లు క్లాస్ మూవీస్ తో మాస్ ను మెప్పించే ప్రయత్నం చేశాడు. బట్ ఫస్ట్ టైమ్ ఓ ఊరమాస్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు.

పరుగులు పెట్టించే స్క్రీన్ ప్లేతో పెద్ద హిట్స్ అందుకున్న దర్శకుడు హరి. అతని దర్శకత్వంలోనే విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. ఆల్మోస్ట్ ఈ కాంబోలో ప్రాజెక్ట్ ఓకే అయిందని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని టాక్. నిజానికి ఇప్పటి వరకూ హరి స్టైల్ చూసిన ఎవ్వరికీ విజయ్ సేతుపతి అతని స్టైల్ లో సెట్ అవుతాడు అనిపించదు. బట్ నటుడుగా ఎలాంటి వేరియేషన్ అయినా చూపించాలనుకుంటాడు విజయ్. అందుకే హరి స్టైల్ లోకి తను వెళ్లే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది.

ఇక విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని టాప్ హీరోయిన్ నయనతార నిర్మించబోతోంది. తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. గతంలో విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన నానుమ్ రౌడీదాన్(నేనూ రౌడీనే) బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీకి సంబంధించిన 3 సెకన్ల క్లిప్ ను వాడుకున్నారనే రీసెంట్ గా నయన్ పై 10 కోట్లకు దావా వేశాడు ధనుష్. సో.. ఆ కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా ఆడియన్స్ లో మంచి క్రేజ్ వస్తుంది. కాకపోతే ఇందుతో నయనతార కూడా నటిస్తుందా లేదా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే కోలీవుడ్ లో దీన్నో క్రేజీ కాంబినేషన్ గా చెబుతున్నారు.

Tags

Next Story