Vijay Sethupathi: కమల్ హాసన్ తర్వాత ఆ స్టార్ హీరోను టార్గెట్ చేసిన విజయ్ సేతుపతి..

Vijay Sethupathi: కోలీవుడ్‌లోనే హీరోలంటే కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. చాలామంది ఇతర భాషా ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు విజయ్ సేతుపతి. ఈ నటుడు అంటే చాలామందికి ఎంతో అభిమానం. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఏ పాత్ర అయినా ప్రాణం పెట్టి చేస్తాడు విజయ్ సేతుపతి. అందుకే విజయ్ సేతుపతిని వదులుకోలేని ఓ డైరెక్టర్ తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నాడు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో ఉన్న సినిమాల సంఖ్య తక్కువేమి కాదు. కొన్ని సినిమాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో విలన్‌గా, మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ విజయ్ సేతుపతి ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా త్వరలోనే తాను బాలీవుడ్‌లో కూడా డెబ్యూ చేయనున్నాడు. అయితే ఇప్పటికే రెండుసార్లు విలన్‌గా భయపెట్టిన విజయ్.. త్వరలోనే మూడోసారి విలన్‌గా కనిపించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ యూత్‌ఫుల్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట. అంతే కాకుండా వాటిలో ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్‌ను కూడా జోడిస్తాడు విఘ్నేష్. అయితే ఇప్పటికే విఘ్నేష్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో విజయ్ సేతుపతిని హీరోగా చూపించిన విఘ్నేష్ త్వరలోనే తనలోని విలన్ యాంగిల్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నాడట.
ఉప్పెన, మాస్టర్ లాంటి చిత్రాల్లో విజయ్ సేతుపతి విలన్‌గా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. అయితే అజిత్, విఘ్నేష్ శివన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా విజయ్ సేతుపతినే విలన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్‌తో తలపడుతున్న విజయ్.. త్వరలోనే అజిత్‌తో కూడా ఢీ కొట్టనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com