Vijay Sethupathi : విజయ్ సేతుపతి .. ఏం మేకోవర్ గురూ ఇదీ..

ఏదైనా కొత్త కాంబినేషన్ తో సినిమా వస్తుంటే .. అది కూడా హీరో హీరోయిన్ ఫస్ట్ టైమ్ జత కడితే పెయిర్ ఫ్రెష్ గా ఉంది అంటుంటారు. కానీ అన్నీ అలా ఉండవు. ఏదో అలా అనేస్తుంటారంతే. బట్ ఈ జంటను చూస్తే ఆ మాట అనకుండా ఉండలేరు. ముఖ్యంగా విజయ్ సేతుపతి మేకోవర్ చూస్తే ఏం మేకోవర్ గురూ ఇది అనాలనిపించేస్తుందంతే. ఆ రేంజ్ లో ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. కావడానికి తమిళ్ సాంగే అయినా విన్న కొద్దీ వింటూనే ఉండాలనిపిస్తోంది. మరి ఈ కాంబో ఎందుకు ఇంత ఫ్రెష్ గా ఉందీ అంటే సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్.. విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్నారు కాబట్టి. ‘ఏస్’ అనే తమిళ సినిమా నుంచి విడుదలైన ఈ ఫస్ట్ వీడియో సాంగ్ చూస్తే మెస్మరైజ్ అయిపోతారంతే. ఈ మధ్య కాలంలో తమిళ్ లోనే కాదు.. తెలుగులోనూ ఇంత బ్యూటీఫుల్ మెలోడియస్ మాంటేజ్ సాంగ్ రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
రుక్మిణి ఎలాంటి బ్యూటీఫుల్ లేడీనే.కానీ విజయ్ సేతుపతి ఆమె ఏజ్ ను మ్యాచ్ చేసేలా తనను తాను మలచుకున్న విధానం చూస్తే హ్యాట్సాఫ్ అనేస్తాం. మొన్నటికి మొన్న జవాన్ లో విలన్ గా చాలా చబ్బీగా కనిపించాడు. అలాగే మహారాజలో ఏజ్ బార్ మనిషిలా మెప్పించాడు. ఇప్పుడు ఈ కథకు తగ్గట్టుగా సన్నబడ్డాడు. ఓ పదేళ్ల వయసు తగ్గినట్టు ఉండేలా తనను తాను మలచుకున్నాడు. నిజంగానే ఓ పదేళ్ల క్రితం విజయ్ సేతుపతిలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటే కాదనలేం. కాస్ట్యూమ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ట్యూన్.. ఇవన్నీ మన భాష కాకపోయిన ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మూవీ తెలుగులో వస్తుందా లేదా అనేది తెలియదు కానీ.. ఫ్రెష్ కాంబినేషన్ అంటే అర్థం ఇదీ అనేలా ఉన్నారు ఇద్దరు. అంతకు మించి మెస్మరైజింగ్ మేకోవర్ తో సర్ ప్రైజ్ చేశాడు విజయ్ సేతుపతి.
ఇక ఈ చిత్రాన్ని ఆరుముగ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించాడు. ఈ పాట పాడింది శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com