Puri Jagannadh : విజయ్ సేతుపతి .. ‘భవతీ భిక్షాందేహి’..

Puri Jagannadh :  విజయ్ సేతుపతి .. ‘భవతీ భిక్షాందేహి’..
X

ఏ కథకైనా టైటిల్ చూపించే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలంటే టైటిల్ కథకు దాటి కనిపించొచ్చు. ఆ హీరోల ఇమేజ్ కోసం పెట్టేది అయి ఉండొచ్చు. బట్ కథకు తగ్గ టైటిల్ అనేది ఎప్పుడైనా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కథలు చెప్పడం మానేసి సినిమాలను చుట్టేస్తోన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సారి కథతోనే వస్తున్నాడు అనిపించేలా ఉంది ఈ టైటిల్ అంటున్నారు జనం. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్నాడు కదా..? ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే టాక్ ఆ మధ్య వినిపించింది. అయితే టైటిల్ అదే కానీ.. ఈ సారి సంస్కృతం వైపు వెళుతున్నాడట పూరీ జగన్నాథ్. అందుకే ఈ మూవీకి ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.

త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోన్న ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. అలాగే విజయ్ సేతుపతి హీరోనే అయినా అతని పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ తో కొనసాగుతుందట. అలాగే కన్నడ హీరో దునియా విజయ్ మరో కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఎప్పట్లాగే పూరీ స్పీడ్ తో ఈ చిత్రాన్ని అతి తక్కువ వర్కింగ్ డేస్ లోనే ఫినిష్ చేయబోతున్నారట. ఏదేమైనా భవతి భిక్షాందేహీ అనే టైటిల్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story