Vijay Varma : తమన్నా కోసం డేటింగ్ పాలసీని మార్చుకున్న విజయ్ వర్మ

Vijay Varma :  తమన్నా కోసం డేటింగ్ పాలసీని మార్చుకున్న విజయ్ వర్మ
బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం డేటింగ్ పాలసీని క్రాస్ చేసిన హీరో

స్టార్ యాక్టర్స్ విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇటీవలి కాలంలో సినిమాల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో, వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' షూటింగ్ సమయంలో కలుసుకున్న వీరిద్దరూ.. ఒకరినొకరు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు బహిరంగంగా అంగీకరించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎక్కువగా మాట్లాడుకునే జంటలలో ఒకరుగా మారారు. అయితే విజయ్ ఇటీవల తన జీవితంలో ఒక హీరోయిన్లతో డేటింగ్ ఎందుకు కోరుకోలేదో, తమన్నాను కలవడం తన దృక్పథాన్ని ఎలా మార్చిందో వెల్లడించాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. తమన్నా భాటియాతో డేటింగ్ గురించి చెప్పాడు. ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడిన విజయ్, ఆమెతో ఎందుకు డేటింగ్ చేయకూడదనుకుంటున్నారో వెల్లడించాడు. "నేను కెరీర్ ప్రారంభంలో, ఎవరితోనూ డేటింగ్ ఉండకూడదని అనుకున్నాను" అని విజయ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ తమన్నాను కలిసిన తర్వాత ఏమి మారిందో కూడా విజయ్ వెల్లడించాడు. “కానీ మేము ఒకరినొకరు చూసుకోగానే.. వ్యాపారం తెలిసిన, కళాత్మక, సృజనాత్మక, లాజిస్టిక్‌లను అర్థం చేసుకున్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంతో విలువనిచ్చిందని అన్నాడు. "ఆమె అనుభవం, ఆమె చేసే మంచి పనులు, జ్ఞానం నిజంగా నాకు చాలా సహాయపడతాయి. ఆమె చాలా విషయాలపై మంచి దృక్పథాన్ని కలిగి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

కొన్ని రోజుల క్రితం తమన్నా కూడా తన భావాలను వెల్లడించింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story