సినిమా

Vijayakanth Discharged : ఆసుపత్రి నుంచి కెప్టెన్‌ విజయకాంత్ డిశ్చార్జ్

Vijayakanth Discharged : తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Vijayakanth Discharged : ఆసుపత్రి నుంచి కెప్టెన్‌ విజయకాంత్ డిశ్చార్జ్
X

Vijayakanth Discharged : తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆయన క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా ఈనెల 19న విజయ్‌కాంత్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే బుధవారం వేకువజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నిన్న సాయంత్రం వరకూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్‌ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్‌ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Next Story

RELATED STORIES