Puri Jagannadh : లైగర్ ఫ్లాప్ పై విజయేంద్ర ప్రసాద్ రియాక్షన్
పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ. కొన్నాళ్లుగా మాత్రం అది మాగ్జమం డౌట్ అన్నట్టుగా మారింది. ఇండస్ట్రీలో ఫ్లాపులు ఎవరికైనా కామన్. కానీ పూరీకి అవి వరస కట్టాయి. అందుకు ప్రధాన కారణంఅతని కంటెంట్ మారలేదు. హీరోయిజం తీరు మారలేదు అనే విమర్శలు వచ్చినా అతను మారలేదు. అందుకే అన్ని ఫ్లాపులు పడ్డాయి. అయినా ప్రతిసారీ లేస్తూనే ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ప్యాన్ ఇండియా మూవీగా వచ్చి లైగర్ డిజాస్టర్ అతనిపై కోలుకోలేనంత ప్రభావం చూపించింది. అయినా తిరిగి లేచాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటూ రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నాడు. అయితే లైగర్ పోయినప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ పూరీ జగన్నాథ్ కు కాల్ చేశాడట. ' నీలాంటి దర్శకుడికి ఫ్లాపులు వస్తే చూడలేకపోతున్నాను.. ఈ సారి సినిమా తీస్తున్నప్పుడు ఆ కథను ముందు నాకు చెప్పు..' అన్నాడట. విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేయడంతో పూరీ జగన్నాథ్ బాగా ఎమోషనల్ అయ్యాడట.
మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కథ ముందుగా ఆయనకు నెరేట్ చేశాడా అంటే లేదనే చెప్పాడు పూరీ. సో.. తనకు నచ్చిందే చేయడం పూరీ స్టైల్ కదా. అందుకే విజయేంద్ర ప్రసాద్ అడిగినా కూడా ఈ కథ ముందు ఆయనకు చెప్పలేదనే అనుకోవాలి.
మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి తనలోని ఊరమాస్ యాంగిల్ ను చూపించబోతున్నాడు దర్శకుడు. ట్రైలర్ చూస్తే కంప్లీట్ గా ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ లోనే కనిపిస్తోంది. మరి ఆ టెంప్లేట్ ఈ సారి కూడా వర్కవుట్ అయితే పూరీతో పాటు రామ్ కు కూడా హిట్ పడ్డట్టే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com