Vijay's Thalapathy 69 : విజయ్ సినిమాలో బాలకృష్ణ సీన్స్

Vijays Thalapathy 69 :  విజయ్ సినిమాలో బాలకృష్ణ సీన్స్
X

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా చివరి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అతను యాక్టివ్ పొలిటీషియన్ గా మారబోతున్నాడు. ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేశాడు. బహిరంగ సభలు కూడా పెడుతున్నాడు. అయితే ఇటు సినిమా అటు రాజకీయాలు అంటూ డ్యూయొల్ రోల్ చేయకుండా పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. అభిమానుల కోసం చివరి సినిమా చేస్తున్నాడు.

ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ అని చెబుతున్నా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తగ్గ డైలాగ్స్ కూడా ఉంటాయట. నిజానికి ఈ కథను కమల్ హాసన్ కోసం రాసుకున్నాడు వినోద్. ఆ కథనే కాస్త మార్పులు చేసి విజయ్ తో చేస్తున్నాడు. విజయ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమమ్ తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. బాబీ డియోల్ విలన్.

ఇక ఈ మూవీ మన బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిని పోలి ఉంటుందంటున్నారు. కాస్టింగ్ కూడా అలాగే ఉంది. కాజల్ పాత్రలో పూజా, శ్రీ లీల పాత్రలో మమిత, విలన్ గా అర్జున్ రాంపాల్ పాత్రలో బాబీ డియోల్ ఉన్నారు. అయితే కథను పూర్తిగా తీసుకోకుండా భగవంత్ కేసరి లైన్ లో సాగుతుందట. ముఖ్యంగా ఈ మూవీకే హైలెట్ గా నిలిచిన బాలయ్య స్పీచ్.. ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ అంటూ ఓ సీన్ ఉంటుంది. అది విజయ్ సినిమాలో యధాతథంగా వాడబోతున్నారని టాక్. ఏదేమైనా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. విజయ్ కి తమిళనాట తిరుగులేని క్రేజ్ ఉండటంతో పాటు పొలిటికల్ గా స్ట్రాంగ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో చివరి సినిమా అంటే ఖచ్చితంగా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ కావడంలో హెచ్ వినోద్ ఏ మాత్రం తడబడినా అతని కెరీర్ అంతా విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ కు గురి కావాల్సి ఉంటుంది.

Tags

Next Story