Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో విక్రమ్.. ?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో విక్రమ్.. ?
X

రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచానికి ఇండియన్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. ఇప్పటి వరకూ అతను ఒక్క కొత్త కథ చెప్పకపోయినా పాత కథలతోనే పర్ఫెక్ట్ ఎమోషన్స్ ను ఎంటర్టైన్మెంట్స్ ను మిక్స్ చేసి ఆడియన్స్ ను మాయ చేయగలడు. అదే అతన్ని అంతర్జాతీయ స్థాయి దర్శకుడుగా మార్చింది. అఫ్ కోర్స్ టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ అనుకోండి. జక్కన్న సినిమాలో నటించడం అంటే ఒకేసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు పరిచయం కావడమే. అందుకే ఆయన మూవీలో ఆఫర్ అంటే మినీ స్టార్ నుంచి టాప్ స్టార్ వరకూ ఎగిరి గంతేస్తారు.

ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాకు సిద్ధం అవుతున్నాడు జక్కన్న. సో ఆటోమేటిక్ గా ఈ మూవీకి సంబంధించి అనేక రూమర్స్ వస్తుంటాయి కదా. అలాంటిదే ఇదా అనిపించేల.. ఈ మూవీలో మహేష్ తో పాటు మరో కీలక పాత్ర కోసం తమిళ్ స్టార్ చియాన్ విక్రమ్ ను తీసుకున్నాడు అనే టాక్స్ వచ్చాయి. ఇదే విషయం గురించి తంగలాన్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు విక్రమ్ ను అడిగితే.. రాజమౌళితో మాట్లాడింది నిజమే కానీ.. మహేష్ మూవీ కోసం కాదు అన్నాడు. అంతేకాదు.. ఫ్యూచర్ లో ఇద్దరం కలసి పనిచేస్తాం అనే హింట్ కూడా ఇచ్చాడు.

అయితే విక్రమ్ చెప్పాడు కాబట్టి ఇది రూమర్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే రాజమౌళి కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన హీరోల గెటప్ నుంచి సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల వరకూ సీక్రెట్ మెయిన్టేన్ చేస్తుంటాడు. మిగతా వారిని కూడా అదే ఫాలో కావాలని చెబుతాడు. అంచేత విక్రమ్ కూడా విషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేడు అనుకునేందుకు కూడా ఆస్కారం ఉంది. బట్ ప్రస్తుతానికైతే.. మహేష్ మూవీలో తను లేను అని చెప్పిన విక్రమ్ మాటలనే విశ్వసిద్దాం.

Tags

Next Story