'అపరిచితుడు' విక్రమ్ కోసం కాదు..టాలీవుడ్ హీరో కోసం.. ఆ స్టార్ ఎవరో తెలుసా?

అపరిచితుడు విక్రమ్ కోసం కాదు..టాలీవుడ్ హీరో కోసం.. ఆ స్టార్  ఎవరో తెలుసా?
Aparichitudu: భారీ చిత్రాల దర్శకుడు శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Aparichitudu: భారీ చిత్రాల దర్శకుడు శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన కన్నా ఎక్కువగా ఆయన సినిమాలే మాట్లాడతాయి. బాక్స్ ఆఫీస్ విజయం అయినా..కలెక్షన్ల వర్షం అయినా.. ఆయన సినిమా రిలీజ్ అవనంతవరకే.. ఒకసారి ఆయన సినిమా రిలీజ్ అయిందంటే పాత రికార్డులన్ని బద్దలు కావాల్సిందే. శంకర్ తమిళ డైరెక్టర్ అయినప్పటికీ.. దేశమంతటా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ రజినీతో తెరకెక్కించిన రోబో సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ క్రియేట్ చేసింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా. అది శంకర్ రేంజ్ అంటే.

వాణిజ్య అంశాలకి, సామాజిక అంశాలని కలిపి సినిమాలు తీయడంలో ఆయనకీ ఆయనే సాటి. ఆయన ప్రతీ సినిమాలో ఎదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే ఉంటారు. అది ఆయన మొదటి సినీమా జెంటిల్మెన్ తోనే ప్రారంబించారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్ల గురించి శంకర్ ఈ మూవీలో ప్రస్తావించారు. 1993 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్టై శంకర్ ని స్టార్ డైరెక్టర్ ల వరుసలో నిలిపింది. ఆ తరువాత వచ్చిన భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడు, వంటి సినీమాలు అదే కోవాలోకి వస్తాయి.

అయితే ఇక్కడ ముఖ్యంగా అపరిచితుడు సినిమా గురించి చెప్పుకోవాలి. చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా 2005లో రిలీజ్ అయి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధి కాన్సెప్ట్ గా తీస్కోని దానికి లంచగొండితనం అనే సామాజిక అంశాన్ని జోడించి శంకర్ తెరకెక్కించిన విదానం అధ్బుతం. మూడు షేడ్స్ ఉన్న పాత్రలో విక్రమ్ తిరుగులేని నటనని కనబరిచాడు .

అయితే కొన్ని కొన్నిసార్లు ఒక హీరోతో అనుకున్న సినిమాలు ఇంకో హీరోతో చేయాల్సివస్తుంది. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం. అపరిచితుడు సినిమాకి కుడా అలానే జరిగింది. కాని సినిమా విషయంలో కాదు, అపరిచితుడు అనే టైటిల్ విషయంలో. అవును.. అపరిచితుడు అనే టైటిల్ ని ముందుగా టాలీవుడ్ యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ కోసం రిజిస్టర్ చేయించారు. 1994లో దర్శకుడు శ్రీనువైట్ల రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే సినిమాని చేద్దాం అనుకున్నాడు. 20% షూటింగ్ కూడా పూర్తి చేస్కున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. తరువాత శ్రీనువైట్ల 1998లో "నీకోసం" అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

అలా రాజశేఖర్ చేయాల్సిన "అపరిచితుడు" అనే టైటిల్ తో సినిమా తీసి హిట్టు కొట్టాడు శంకర్. అంతే కాదు శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు సినిమాలు కూడా ముందుగా రాజశేఖర్ ని హీరాగా అనుకున్నవే. కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమాలు కూడా చేయలేకపోయాడు. ఈ రెండు మూవీస్ రాజశేఖర్ చేసుంటే ఖచ్చితంగా స్టార్ హీరోల లిస్టులో చేరి ఉండేవాడు . కాని విశేషం ఏంటంటే రాజశేఖర్ వదిలేసిన ఈ రెండు సినిమాల్లోనూ హీరోగా నటించింది అర్జునే .


Tags

Read MoreRead Less
Next Story