Vikram: ఓటీటీలోకి 'విక్రమ్'.. ఎప్పటి నుంచి అంటే..

Vikram: ఓటీటీలోకి విక్రమ్.. ఎప్పటి నుంచి అంటే..
Vikram: నాలుగేళ్ల తరువాత వచ్చిన కమల్ హాసన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపిస్తోంది.

Vikram: నాలుగేళ్ల తరువాత వచ్చిన కమల్ హాసన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపిస్తోంది. విక్రమ్ సినిమా సక్సెస్ ని కుటుంబం కూడా ఎంజాయ్ చేస్తుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

లోకేశ్ దర్శకత్వ ప్రతిభ, కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ల నటన చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకున్నాయి. జులై 8 నుంచి ఓటీటీలో విక్రమ్ స్ట్రీమ్ అవనుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story