RC 15 Movie: శంకర్, రామ్ చరణ్ సినిమాలో విలన్ ఫిక్స్..?

RC 15 Movie: రామ్ చరణ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. తాను హీరోగా చేసిన ఒకేఒక్క పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే రామ్ చరణ్‌కు వరుసగా పాన్ ఇండియా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమాను స్టార్ట్ చేసిన చరణ్.. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో విలన్ ఫైనల్ అయినట్టు టాక్.
శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడడు శంకర్. యాక్షన్ చేయడంలో తనదైన స్టైల్‌తో మ్యాజిక్ చేస్తాడు చరణ్. అందుకే వీరి కాంబినేషన్‌పై ఇప్పటికే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఈ అంచనాల రేంజ్‌ను అందుకోవడం కోసం క్రేజ్ ఉన్న విలన్‌ను రంగంలోకి దింపనున్నాడు శంకర్.
ఇప్పటివరకు రామ్ చరణ్‌తో తెరకెక్కనున్న సినిమాలో దాదాపు అన్ని పాత్రలకు యాక్టర్స్‌ను ఖరారు చేశాడు శంకర్. కానీ విలన్‌ను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ఎంతో ఆలోచించిన తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఎస్‌జే సూర్యను ఇందులో విలన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం.
ఒకప్పుడు ఎస్‌జే సూర్య డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు విలన్‌గా పాపులర్ అవుతున్నాడు. అంతే కాకుండా తనను విలన్‌గా తీసుకోవాలని ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు తన వెంటపడుతున్నారు. క్రేజ్‌కు తగినట్టుగా సూర్య కూడా కోట్లలో రెమ్యునేషన్‌ను ఛార్జ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలయిన 'మానాడు' సినిమా కూడా సూర్యకు విలన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టడంతో తానే ఈ మూవీకి విలన్‌గా కరెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నాడట శంకర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com