Vinod Kumar : ఆమనితో ఆ సాంగ్ చేస్తుంటే నా భార్య షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది : వినోద్ కుమార్

Vinod Kumar : వినోద్ కుమార్... తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో హీరోగా తనదైన ముద్రవేశాడు. మౌనపోరాటం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన వినోద్ కుమార్.. ఆ తర్వాత మామగారు, కర్తవ్యం, సీతారత్నం గారి అబ్బాయి, అమ్మ నా కోడలా మొదలగు చిత్రాలలో నటించి మెప్పించారు. ఇందులో మామగారు సినిమాకి గాను ఆయనకి నంది అవార్డు లభించింది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించారు వినోద్ కుమార్.. తాజాగా అలీతో సరదాగా షోకి వచ్చిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరోయిన్ ఆమనితో ఓ రొమాంటిక్ సాంగ్ చేస్తున్నప్పుడు షూటింగ్‌లో అక్కడే ఉన్న తన భార్య అది చూడలేక సిగ్గుతో అక్కడినుంచి లేచి వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక నటుడు సాయికుమార్ తనకి కర్తవ్యం సినిమా నుంచి పరిచయమని అయితే తనకి డబ్బింగ్ చెప్పట్లేదని ఓ సారి కొట్టాలని అనుకున్నానని సరదాగా అన్నారు.
మోహన్ గాంధీ, దాసరి, కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో సినిమాలు చేయడం అదృష్టమని అన్నారు. కెరీర్‌లో ఇన్ని సినిమాలు చేయడం అంటే మాములు విషయం కాదు అంటూ చివర్లో ఎమోషనల్ అయ్యారు వినోద్ కుమార్. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com