Urvashi Dholakia : బాలీవుడ్ నటికి సర్జరీ విజయవంతం

Urvashi Dholakia : బాలీవుడ్ నటికి సర్జరీ విజయవంతం
ఊర్వశి 'కసౌతీ జిందగీ కే', 'కహీన్ తో హోగా', 'ఇష్క్ మే మార్జవాన్' మరియు ఇతర చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.

మెడ భాగంలో అయిన కణితికి శస్త్ర చికిత్స చేయించుకున్న నటి ఊర్వశి ధోలాకియా తన శస్త్రచికిత్స విజయవంతమైందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. ఊర్వశి 'కసౌతీ జిందగీ కే', 'కహీన్ తో హోగా', 'ఇష్క్ మే మార్జవాన్' లాంటి ఇతర చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. అంతకుముందు షేర్ చేసిన ఫొటోలో ఊర్వశి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని కెమెరా వైపు నవ్వుతూ కనిపించింది.

ఒక ప్రకటనలో ఆమె.. “డిసెంబర్ 2023 ప్రారంభంలో మెడలో కణితి (తిత్తి) ఉన్నట్లు నిర్ధారణ అయినందున నేను శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. నా శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడు నేను 15 నుండి 20 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు" అని చెప్పింది. ఇక ఆమె వర్క్ ఫ్రంట్‌లో, ఇటీవల సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లా జా 11'లో పోటీదారుగా కనిపించింది. అయితే ఈ షో నుంచి ఆమె ఎలిమినేట్ అయింది. అంతే కాకుండా ఆమె 'పుష్ప ఇంపాజిబుల్'లో దేవి సింగ్ షెకావత్‌గా కూడా కనిపించింద



Tags

Read MoreRead Less
Next Story