Salman Khan : గణేష్ ఉత్సవాల్లో సల్మాన్ డ్యాన్స్
షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్, ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అన్ని పండుగలు, మతాలను జరుపుకునే లౌకిక విధానం కోసం విస్తృతంగా గుర్తింపు పొందారు. అతను ఈద్, దీపావళి లాంటి అన్ని పండుగలను హృదయపూర్వకంగా స్వీకరిస్తాడు, గౌరవిస్తాడు. ఐక్యత భావాన్ని పెంపొందించుకుంటాడు.
ఇటీవల సల్మాన్.. తన సోదరి అర్పితా ఖాన్ శర్మ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు , అర్పిత ఇంట్లో ఉల్లాసంగా జరిగే ఈ వేడుకలను అభిమానులకు స్నీక్ పీక్ ఇచ్చాడు. “గణపతి బప్పా మోరియా” అని క్యాప్షన్‌తో సల్మాన్ ఈ పోస్టు చేశాడు.
ఇప్పుడు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ ధోల్ బీట్‌లకు డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్లిప్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అతని ఉత్సాహం, నృత్య కదలికలు పండుగ సందర్భానికి అదనపు మెరుపును జోడించాయి.
సల్మాన్ ఖాన్ వర్క్ ఫ్రంట్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'టైగర్ 3లో' కత్రినా కైఫ్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కూడా అతిధి పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా భాయిజాన్ లైనప్ లో 'టైగర్ Vs పఠాన్' కూడా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com