Virata Parvam: విరాటపర్వం విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Virata Parvam: కోవిడ్ వల్ల ఎన్నో సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావాల్సి వచ్చింది. అంతే కాకుండా మరెన్నో సినిమాలు షూటింగ్ అర్థాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరికొన్ని సినిమాలు అయితే ఏకంగా పూర్తయిన తర్వాత పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అలాంటి సినిమాల్లో ఒకటే 'విరాటపర్వం'. రానా, సాయి పల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రిలీజ్ డేట్ ఫైనల్‌గా ఫిక్స్ అయ్యింది.
సాయి పల్లవి సినిమాలు అయినా, రానా సినిమాలు అయినా ప్రేక్షకుల్లో కనీస అంచనాలు ఉంటాయి. అందుకే విరాటపర్వం సినిమా కూడా అనౌన్స్‌మెంట్ దగ్గర నుండి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విడుదలయిన టీజర్.. సినిమాలో ఏదో కొత్తదనం ఉంది అనిపించేలా చేసింది. విరాటపర్వం నుండి విడుదలయిన ఓ పాట కూడా బాగానే ఆకట్టుకుంది.
ఎన్నో విధాలుగా ఆకట్టుకున్న విరాటపర్వం.. విడుదల తేదీని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకునేలోపే లాక్‌డౌన్ ఎఫెక్ట్ పడింది. ఓసారి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే ముందు మరో లాక్‌డౌన్ వల్ల బ్రేక్ వచ్చింది. దీంతో సినిమా అసలు ఉందా? లేదా? అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. కానీ ఫైనల్ విరాటపర్వం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
'నీది నాది ఒకే కథ'లాంటి సోషల్ మెసేజ్ ఉన్న యూత్‌ఫుల్ కథను తెరకెక్కించిన వేణు ఊడుగుల.. విరాటపర్వంను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా చాలా వాయిదాల తర్వాత జులై 1న విడుదల కానున్నట్టు తాజాగా మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన విరాటపర్వం ఇప్పటికైనా రిలీజ్ అవుతున్నందుకు సాయి పల్లవి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com