Virgin Boys : యువత టార్గెట్ గా పెదవుల తడి సాంగ్

త్వరలో విడుదల కానున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఆసక్తి రేపుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని ‘పెదవుల తడి’ పాట విడుదల అయ్యింది. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. పూర్ణ చారి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఆర్ కె గొంతులోని మాయాజాలం పాటకు ప్రాణం పోసింది. అతని గాత్రంలోని భావోద్వేగం, యువతీయువకుల ప్రేమ ఊహలను పట్టిస్తూ, పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. స్మరణ్ సాయి సంగీతం ఈ పాటకు యూత్ ఫుల్ నెస్ నుతీసుకు వచ్చింది.
వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ పాటను అందంగా మలిచింది. నటీనటుల కెమిస్ట్రీ స్క్రీన్‌పై చక్కని రొమాంటిక్ వైబ్‌ను సృష్టించింది. ఈ పాట యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ, సినిమా యొక్క రొమాంటిక్ కామెడీ & సెంటిమెంటల్ జోనర్‌కు సరిగ్గా సరిపోయింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పాటకు స్ఫురణను, లయను అందించి, ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా మలిచింది.
లిరిక్స్‌లో పూర్ణ చారి యువత హృదయాలను తాకే సున్నితమైన పదాలను ఎంచుకున్నారు. ఈ పాటలోని దృశ్యాలు రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ నాణ్యమైన నిర్మాణ విలువలను ప్రతిబింబిస్తాయి. ఇవి యువత ఆకర్షణను, ఆధునిక జీవనశైలిని సమర్థవంతంగా చూపించాయి. మొత్తంగా, ‘పెదవుల తడి’ ఒక రిఫ్రెషింగ్, ఎనర్జిటిక్ ట్రాక్ గా రొమాంటిక్ వైబ్‌ను ఇస్తుంది.
నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ..“‘వర్జిన్ బాయ్స్’ యువత ఆలోచనలను, భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకి సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని, దాన్ని త్వరలో ప్లాన్ చేస్తామని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com