Virupaksha Sequel ; 'విరూపాక్ష' సీక్వెల్ పై సాలిడ్ అప్ డేట్.. పోస్టర్ రిలీజ్

Virupaksha Sequel ; విరూపాక్ష సీక్వెల్ పై సాలిడ్ అప్ డేట్.. పోస్టర్ రిలీజ్
X
'విరూపాక్ష' సీక్వెల్ పోస్టర్ రిలీజ్.. హీరో ఎవరంటే..

గత కొంతకాలంగా మాంచి హిట్ కోసం చూస్తోన్న మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో ఆ కలను నెరవేర్చుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగానే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విరూపాక్ష'.. ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాతో రెండో పార్ట్ ఉంటుందని మేకర్స్ డైరెక్ట్ గానే చెప్పారు. దీంతో దీనికి సీక్వెల్ వస్తుందనే ఇంతకుమునుపే రివీలైంది. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై మేకర్స్ అప్ డేట్ ఎప్పడిస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. 'విరూపాక్ష' సీక్వెల్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరూపాక్ష సీక్వెల్ ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా రూపొందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సీక్వెల్ కు సంబంధించిన పోస్టర్ తో పాటు..‘విరూపాక్ష’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు కూడా వెల్లడించారు. వీలైనంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరి, ఈ మూవీలో హీరోగా సాయి ధరమ్ తేజ్ కొనసాగుతాడా? లేదా మరో హీరోను ఎంపిక చేసుకోకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

క్షుద్రపూజలు, చేతబడులను కథాంశంగా తీసుకుని రూపొందించిన 'విరూపాక్ష' సినిమా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరక్టర్ సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.


Next Story