Vishal, Sai Dhanshika : ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

Vishal, Sai Dhanshika :  ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం
X

విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్, ధన్సిక ఇద్దరూ కూడా స్టేజ్ మీదే తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాల్ని ప్రకటించారు. ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 29న ఈ ఇద్దరి పెళ్లికి అడుగులు పడ్డాయి.

కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అనే మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విశాల్ కెరీర్‌లో 35వ చిత్రంగా రానున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. ‘మకుటం’ మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సీ బ్యాక్ డ్రాప్, మాఫియా కథతో విశాల్ సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘మకుటం’ రూపొందుతోందని సమాచారం.

ఇక త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఇతర వివరాల్ని విశాల్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం విశాల్, ధన్సిక ఎంగేజ్మెంట్ సందర్భంగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు.

Tags

Next Story