Vishal : తెలుగులోనూ విశాల్ సినిమా

Vishal :  తెలుగులోనూ విశాల్ సినిమా
X

మాస్ యాక్షన్ హీరో విశాల్ ఈ మధ్య వార్తల్లో నిలిచాడు. రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో వణుకుతున్న చేతులు, కనీసం మైక్ ను కూడా పట్టుకోలేకపోతున్న నీరసంతో మొహం అంతా అదోరకంగా అయిపోయి కనిపించాడు. దీంతో సౌత్ మొత్తం విశాల్ కు ఏమైంది అంటూ ఆరాలు మొదలుపెట్టారు. ఆ సినిమా మదగజరాజా. ఎప్పుడో దశాబ్దం క్రితం నిర్మాణం పూర్తి చేసుకుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో విశాల్, వరలక్ష్మి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు సౌత్ మొత్తం వచ్చాయి. తర్వాత విడిపోయారు. అది వేరే విషయం.

అయితే మదగజరాజా అప్పుడెప్పుడో రూపొందింది కదా ఇప్పుడెవరు చూస్తారు అనుకున్నారు చాలామంది. బట్ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెగ్యులర్ కమర్షిల్ మాస్ ఎంటర్టైనర్ గానే రూపొందినా.. అప్పట్లో విశాల్ యాక్షన్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా..? ఆ విశాల్ ను మళ్లీ చూడటం.. మాస్ ఎంటర్టైనర్ కావడంతో కోలీవుడ్ లో తెగ చూశారీ సినిమాను. మామూలుగా విశాల్ మూవీ అంటే అదే టైమ్ లో తెలుగులోనూ విడుదల చేస్తారు కదా. కానీ ఈ మూవీ ఆడుతుందో లేదో అని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31న మదగజరాజాను అదే పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి కోలీవుడ్ ను 14యేళ్ల తర్వాత కూడా ఎంటర్టైనర్ చేసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులన కూడా అదే స్థాయిలో అలరిస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story