Vishal's Purushan : మొగుడు పాత్రలో విశాల్

విశాల్ ఈ మధ్య కాస్త వెనకబడిపోయాడు. ఓ వైపు హెల్త్ ఇష్యూస్ కూడా పబ్లిక్ లో కనిపించడం మాత్రం పెద్ద సమస్యగా మారింది. అనారోగ్యం వల్ల ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అనుకున్నారు. బట్ అలాంటివేం లేవు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే టైమ్ లో హీరోయిన్ ను సాయి ధన్సికను పెళ్లి కూడా చేసుకున్నాడు. అతను ఇప్పుడు ‘మొగుడు’గా మారాడు. అంటే అతని భార్య సాయి ధన్సిక కు మొగుడుగా మారడం లేదు. తమన్నా కు మొగుడు అయ్యాడు. మధ్యలో తమన్నా ఎలా వచ్చింది అనిపించింది కదా. యస్.. అతని కొత్త సినిమా టైటిల్ అది.
సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో విడుదల చేసిన వీడియో బావుంది. విశాల్ భార్యగా తమన్నా ఉంటుంది. సీరియల్ హీరోగా నటించే యోగిబాబు ఆమె ఇంటికి వస్తాడు. ఆమె అతన్ని చూసి చాలా ఆనంద పడుతుంది. అతనికి టీ ఇవ్వాలి అంటుంది. కట్ చేస్తే అదే ఇంట్లో భర్తగా కనిపించే విశాల్ ఇంటి పనంతా చేస్తుంటాడు. యోగిబాబుకు టీ పెడతా అని అడుగుతాడు. ఓ వైపు తమన్నా మొగుడును డామినేట్ చేస్తుంది. అదే టైమ్ లో ఆ మొగుడు గారి కోసం కొంతమంది విలన్స్ వస్తారు. వాళ్లంతా సౌండ్ లేకుండా ఆ కిచెన్ లోనే చంపేస్తుంటాడు. చివర్లో అది చూసిన యోగిబాబు షాక్ అవుతాడు. ఆ విషయం మాత్రం తమన్నాకు తెలియదు. తను మాత్రం భర్తపై డామినేషన్ ను చూపిస్తూ ఉంటుంది. అందుకే మొగుడు అనే టైటిల్ పెట్టాడు సుందర్ సి.
చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ. సుందర్ స్టైల్ లోనే ఉండే కథలా కనిపిస్తుంది. నిజానికి విశాల్ తో సుందర్ చేసిన మధగజ రాజా సినిమా 13యేళ్ల క్రితం ఆగిపోయింది. అన్నేళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే మధ్యలో సుందర్ సి.. రజినీకాంత్, కమల్ హాసన్ తో మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. చివరికి ఇప్పుడు మళ్లీ విశాల్ తో మూవీ చేయబోతున్నాడు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించబోతున్నాడు. మరి ఈ మొగుడుగారు మూవీతో సుందర్ విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
