Vishnu Manchu : ఢీ కూడా రీ రిలీజ్ అవుతోంది

Vishnu Manchu :  ఢీ కూడా రీ రిలీజ్ అవుతోంది
X

మంచు విష్ణు కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అంటే ‘ఢీ’ అనే చెప్పాలి. శ్రీను వైట్ల ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు రూపొందించిన ఈ మూవీ హిలేరియస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. శ్రీహరి, బ్రహ్మానందం,సునిల్ తో పాటు విష్ణు కూడా అద్భుతమైన టైమింగ్ అదరగొట్టాడు. జెనీలియా గ్లామర్ తో పాటు నటనా ఆకట్టుకుంటుంది. ఇక డైలాగ్స్ తో నే అదరగొట్టే జయ ప్రకాష్ రెడ్డికి మూగ వాడైన మాజీ పాత్ర ఇవ్వడం శ్రీను వైట్ల కాన్ఫిడెన్స్ ను చూపిస్తుంది. సైగలతోనే ఆయన పంచిన హాస్యమూ ఎవర్ గ్రీన్. బ్రహ్మానందం, సునిల్ మధ్య తాగిన తర్వాత వచ్చే డ్యాన్స్ ఎపిసోడ్ ను ఎన్నిసార్లు చూసినా నవ్వాపుకోలేం. ఎప్పుడు చూసినా ఏ మాత్రం బోర్ కొట్టని సినిమా ఇది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని చాలాసార్లు చెప్పాడు విష్ణు. బట్ ఇప్పటి వరకూ అది కార్యరూపం దాల్చలేదు. ఇన్ని రోజులుగా టివిలతో పాటు యూ ట్యూబ్ లోనూ చాలాసార్లు చూసిన ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు.

తను ఫామ్ లో ఉండగా శ్రీను వైట్ల తీసిన సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఆ స్థాయి వినోదం ఉంటుందా సినిమాల్లో. ఒకే ఫార్మాట్ లో అన్ని విజయాలు సాధించిన దర్శకుడు అతనేనేమో. ఇక ఈ ఢీ చిత్రాన్ని ఈ నెల 28న రీ రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెలలో మంచు విష్ణు కన్నప్ప విడుదల కాబోతోంది. దానికి ముందు ఢీ రీ రిలీజ్ తో కూడా ఆకట్టుకుంటే కన్నప్పకు కాస్త జోష్ వస్తుందేమో.

Tags

Next Story