Vishnu Manchu : ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి అపవిత్రం అయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్వాకం జరిగిందని తేల్చేసింది. ఈ సందర్భంగా కూటమిలోని నాయకులంతా వైసీపిని దుయ్య బడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఇక ఈ వ్వవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కావడం.. సహజంగానే బిజెపి సీరియస్ గా తీసుకోవడం కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.
పవన్ కళ్యాణ్ గారూ తిరుమలలో తప్పు జరిగింది. దీనికి కారణమైన వారిని గుర్తించి శిక్షించండి. అంతే కానీ దీన్ని రాజకీయాలకు వాడుతూ దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తూ.. మతపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికే మన దేశంలో ఉన్న మత పరమైన గొడవలు చాలావా.. అంటూ ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్.
అయతే ప్రకాష్ రాజ్ కామెంట్ ను తప్పు పడుతూ.. మంచు విష్ణు కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.. ‘శ్రీ ప్రకాష్ రాజ్ గారు.. కొంచెం తగ్గండి. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కొన్ని కోట్లమంది హిందువుల నమ్మకం. డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. సరైన విచారణ చేసి దోషులను శిక్షిస్తాం అన్నారు. ఇందులో మీకు మతపరమైన గొడవలు ఎక్కడ కనిపించాయి..? ’ అంటూ మంచు విష్ణు పోస్ట్ చేశాడు. మరి దీనికి కూడా ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com