సినిమా

Vishnu Manchu : 'మనుసులో సినిమా పోవాలని అనుకున్నావ్ కదూ'.. : విష్ణు స్ట్రాంగ్ రిప్లయ్

Vishnu Manchu : ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం స‌క్సెస్ కావాల‌ని ఆకాంక్షిస్తూ ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు

Vishnu Manchu :  మనుసులో సినిమా పోవాలని అనుకున్నావ్ కదూ.. : విష్ణు స్ట్రాంగ్ రిప్లయ్
X

Vishnu Manchu : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం స‌క్సెస్ కావాల‌ని ఆకాంక్షిస్తూ 'మా' అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.. 'ఆల్‌ ది బెస్ట్‌ మై బ్రదర్‌ వరుణ్‌ తేజ్‌. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు విష్ణు.. అయితే ఈ ట్వీట్ పైన నెగిటివ్ కామెంట్స్ రావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

'మా' ఎన్నిక‌ల సంద‌ర్భంగా మెగా బ్రద‌ర్ నాగ‌బాబు, విష్ణుల మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ క్రమంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మూవీ గని సక్సెస్ కావాలని కోరుతూ ట్వీట్ చేశాడు విష్ణు. అయితే దీనిపైన ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మనసులో సినిమా ఫ్లాప్ కావాలని గట్టిగా కోరుకుతున్నావ్ కదా' అంటూ కామెంట్ చేశాడు.. దీనిపైన రియాక్ట్ అయిన విష్ణు.. అతడికి స్ట్రాంగ్‌‌‌‌గా సమాధానం ఇచ్చాడు.. ఎందుకు నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? పాజిటివ్‌గా ఆలోచించండి.. తాను మంచి జ‌రిగాల‌ని కోరుకుంటే, నెగెటివ్‌గా చూడ‌డం ఏంట‌ని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌‌‌‌గా మారింది.

ఇక గని సినిమా విషయానికి వచ్చేసరికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కింది. ఇందులో వరుణ్ తేజ్ సరసన స‌యీ మంజ్రేక‌ర్‌ హీరోయిన్ గా నటించింది. జ‌గ‌ప‌తిబాబు, ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, న‌వీన్‌చంద్ర, న‌దియా, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి కీలక పాత్రల్లో నటించారు. త‌మ‌న్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు.

Next Story

RELATED STORIES