Vishvak Sen : నెల తిరక్కుండానే ఓటిటిలోకి విశ్వక్ సేన్ లైలా

Vishvak Sen :  నెల తిరక్కుండానే ఓటిటిలోకి విశ్వక్ సేన్ లైలా
X

ఆడియన్స్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చరిత్రలో ఎన్నోసినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’కనిపిస్తుంది. నాసిరకం రచన, చవకబారు మాటలతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మొదటి ఆట నుంచే తిప్పికొట్టారు. అస్సలే మాత్రం బాగా లేదని తేల్చేశారు. ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న హీరో సినిమాకు దారుణమైన రివ్యూస్ రాశారు.. రేటింగ్స్ ఇచ్చారు అంటే లైలా సినిమానే చెప్పాలి. దీన్ని హీరో విశ్వక్ సేన్ కూడా అంగీకరించాడు. ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

లైలా చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేశాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటి వరకూ మంచి సినిమాలే చేసిన సాహు గారపాటి నిర్మించాడు. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా లైలా సినిమా విడుదలైంది ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి నెల కూడా కాకుండానే ఓటిటిలోకి వచ్చేస్తోంది. మూమాలుగా అయితే 30 లేదా 45 రోజుల తర్వాతే ఓటిటిలో విడుదల చేస్తారు. అది రూల్ కూడా. ఇలాంటి మూవీస్ కు అలాంటి రూల్స్ వర్తించవు. అందుకే మార్చి 7 నుంచి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. మరి ఓటిటిలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story