Vishwak Sen : విశ్వక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ కీ రోల్ లో కనిపించనుంది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘విశ్వక్‌సేన్ గత చిత్రాలకు భిన్నంగా ఉండే కథ ఇది. చక్కటి కామెడీతో పాటు రోమాంచితమైన యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. ముక్కోణపు ప్రేమాయణం కథలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్నందించారు’ అని చిత్రబృందం తెలిపింది. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com