Ashoka Vanamlo Arjuna Kalyanam: ఇంటర్‌క్యాస్ట్.. అరేంజ్డ్ మ్యారేజ్.. సినిమాల్లో అయినా ఇదే ఫస్ట్ టైమ్..

Ashoka Vanamlo Arjuna Kalyanam: యంగ్ హీరోలు ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. పైగా ఈ యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే వారివి మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తున్నాయి. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాంటి ఓ మినిమమ్ గ్యారెంటీ కథతోనే మన ముందుకు రానున్నట్టుగా కనిపిస్తోంది.
'అశోకవనంలో అర్జున కళ్యాణం'.. అదేంటి టైటిల్ ఇంత వెరైటీగా ఉంది అనిపిస్తుంది కదా.. ఇంత అచ్చ తెలుగు టైటిల్‌తో ఓ తెలుగు సినిమా వచ్చి కూడా చాలాకాలమే అయినట్టుంది. అందుకే ఈ సినిమా ప్రీ టీజర్ దగ్గర నుండి అందరికీ ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే కథలతో వచ్చే విశ్వక్ సేన్.. ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్‌తో నవ్వులు పూయిస్తాడని అనిపిస్తోంది.
ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా రుక్సార్ దిల్లాన్నటిస్తోంది. హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేయడానికి ఓ ప్రీ టీజర్‌ను విడుదల చేసిన మూవీ టీమ్.. హీరోయిన్ క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి 'ఓ ఆడపిల్లా నువ్వు అర్థం కావా?' అనే పాటను రిలీజ్ చేసి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
ఇక ఈ మూవీ టీజర్.. 'ఇంటర్‌క్యాస్ట్.. అరేంజ్ మ్యారేజ్.. సినిమాల్లో అయినా జరిగుండదు' అనే డైలాగుతో మొదలవుతుంది. ఇందులోని డైలాగ్స్, విశ్వక్ సేన్ యాక్షన్ అన్నీ ఎంటర్‌టైనింగ్‌గా, ఫన్నీగా అనిపిస్తున్నాయి. మార్చి 4న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుందని టీజర్ చివర్లో మూవీ టీమ్ స్పష్టం చేసింది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com