Vishwak Sen: తన సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపిన విశ్వక్ సేన్..
Vishwak Sen (tv5news.in)
Vishwak Sen: టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ రూటే సెపరేటు. తన సినిమాలకు చేసే ప్రమోషన్స్‌లో కూడా విశ్వక్ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. విశ్వక్ చివరిగా నటించిన 'పాగల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌ను అందుకుంది. ప్రస్తుతం విశ్వక్ దాదాపు మూడు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా తన అప్‌కమింగ్ సినిమా 'ఓరి దేవుడా' మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సినిమా గురించి తెలియని వారు మోషన్ పోస్టర్‌ను చూసి షాక్ అవుతున్నారు.
దేవుడు ఎప్పుడూ ఎవ్వరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. ఒకవేళ ఇస్తే ఆ ఛాన్స్‌ను ఎప్పుడు మిస్ చేసుకోవద్దు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ మూవీ 'ఓ మై కడవులే'. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి విశ్వక్ సేన్ దీనిని 'ఓరి దేవుడా'గా తెలుగులో రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా కోసం తన స్నేహితుడు తరుణ్ భాస్కర్‌ను డైలాగ్ రైటర్‌గా రంగంలోకి దించాడు. దర్శకుడిగా ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన అష్వత్ వైరముత్తునే వ్యవహరిస్తున్నాడు.
ఒరిజినల్ వర్షన్ 'ఓ మై కడవులే'లో హీరోహీరోయిన్లుగా అశోక్ సెల్వన్, రితికా సింగ్ నటించారు. తెలుగులో హీరోగా విశ్వక్ నటిస్తుండగా.. హీరోయిన్‌గా మిథిలా పార్కర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. మిథిలా పాల్కర్ గురించి తెలియని వారు ఎవరో కొత్త అమ్మాయి అనుకొని వదిలేస్తున్నారు. కానీ తెలిసిన వారు తన టాలీవుడ్ ఎంట్రీని సర్ప్రైజ్‌లాగా ఫీల్ అవుతున్నారు.
హిందీలో వెబ్ సిరీస్‌లు చూసే అలవాటు ఉన్నవారికి మిథిలా పార్కర్ సుపరిచితురాలు. ఛాప్‌స్టిక్స్, లిటిల్ థింగ్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో మిథిలా హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా లిటిల్ థింగ్స్ వల్ల బీ టౌన్‌లో మిథిలా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ వెబ్ సిరీస్ వల్ల తనకు పలు సినిమా అవకాశాలు కుడా వచ్చాయి. దుల్కర్ సల్మాన్ హిందీ డెబ్యూ మూవీ 'కార్వాన్'లో తనే హీరోయిన్.
బాలీవుడ్‌లో తన గ్లామర్‌తో, యాక్టింగ్‌తో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మిథిలాను తన సినిమాలో కాస్ట్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ విశ్వక్ 'ఓరి దేవుడా'కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని తన అభిమానులు అంటున్నారు. ఒరిజినల్ వర్షన్‌లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాడు. తెలుగులో ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తున్నాడని టాక్ వినిపించినా అధికారిక ఏ ప్రకటనా రాలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com