Vishwambhara Poster : చిరంజీవి పుట్టినరోజు.. ‘విశ్వంభర’ పోస్టర్ వచ్చేసింది

Vishwambhara Poster : చిరంజీవి పుట్టినరోజు.. ‘విశ్వంభర’ పోస్టర్ వచ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్‌లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్‌కు చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కాగా టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.

Tags

Next Story