Vishwambhara : సంక్రాంతి బరిలోనే ‘విశ్వంభర’
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. అయితే, ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర పనులు, సినిమాకు అత్యంత కీలకంగా భావిస్తున్న వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా పెండింగ్‌లో ఉందట. అందుకే హడావుడిగా ఈ పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని డైరెక్టర్ వశిష్ఠ చిత్రాన్ని సంక్రాంతి నుంచి వాయిదా వేయాలనే ప్రపోజల్‌ను హీరో చిరంజీవి, నిర్మాత వద్ద ఉంచాడట. అయితే చిరంజీవి మాత్రం రాత్రి పగలు కష్టపడి సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేయమని కోరాడట. సంక్రాంతి సీజన్‌ను మిస్ కాకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది. దీంతో సంక్రాంతికే విశ్వంభర రానున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com