Viswak Sen : విశ్వక్ సేన్ పోటీ ఎవరితో

Viswak Sen :  విశ్వక్ సేన్ పోటీ ఎవరితో
X

సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా దూకుడు మీదున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా వచ్చిన మెకానిక్ రాకీ అంచనాలను అందుకోలేదు.కాకపోతే సెకండ్ హాఫ్ ది బెస్ట్ అన్నారు ఆడియన్స్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు. ఆ క్రమంలో అతని కొత్త సినిమా ‘లైలా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ఈ మూవీలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. అతని ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో పోల్చి చూస్తే ఇది ఖచ్చితంగా అతనికి ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. అతనికి జోడీగా ఆకాంక్షశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా లైలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా లైలాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది కాబట్టి ఆ డేట్ కు రావడం పెద్ద కష్టమేం కాదు. పైగా వాలెంటైన్స్ డే అనేది టాలీవుడ్ కు కాస్త స్పెషల్ డేట్ అనే చెప్పాలి. కాకపోతే అదే టైమ్ లో మనోడికి మరో రెండు సినిమాలు పోటీగా ఉన్నాయి. వీటిలో 2023లో విడుదలైన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు క్రిస్మస్ నుంచి తప్పించబడి, సంక్రాంతి కూడా డౌటే అంటోన్న నితిన్ మూవీ రాబిన్ హుడ్ వేరే దారేం లేకపోతే వాలెంటైన్స్ డే కు వస్తుంది. సో.. ఈ రెండు సినిమాలతో లైలా బాక్సాఫీస్ వద్ద తలపడాలి అన్నమాట. ఏదేమైనా విశ్వక్ సేన్ లైలాతో హిట్ కొడతా అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు.

Tags

Next Story