Viswak Sen : తప్పయింది క్షమించండి - విశ్వక్ సేన్

Viswak Sen :  తప్పయింది క్షమించండి - విశ్వక్ సేన్
X

మాస్ కా దాస్ అనే ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. తను హీరోగానే కాక రచయిత, దర్శకుడుగా కూడా ఆకట్టుకున్నాడు. కాస్త మాస్ యాటిట్యూడ్ తో కనిపించే విశ్వక్ సేన్ మూవీస్ కొత్తగానే ఉంటాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లైలాతో అభాసు పాలయ్యాడు. ఈ మూవీ కంటెంట్ పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. బూతు సినిమాల ఉందన్నారు చాలామంది. రివ్యూస్, రేటింగ్స్ అన్నీ దారుణంగా ఇచ్చారు. తను డిపెండ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండా ఇలాంటి మూవీస్ తీస్తే ఇక కెరీరే ముగిసిపోతుందనేలా పబ్లిక్ టాక్స్ కూడా వినిపిచాయి.

లైలాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో కనిపించాడు. ఈ పాత్రతో పాటు ఇతర పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ చీప్ గా ఉన్నాయి. హీరోయిన్ పాత్రను కూడా మరీ దిగజారుడుగా చూపించారు. కేవలం స్కిన్ షోకే పరిమితం అనేలా చేశారు. మొత్తంగా లైలా ఈ డెకేడ్ లోనేచీప్ మూవీ అనిపించుకుంది. ఫైనల్ గా అందరి విమర్శలను సీరియస్ గా తీసుకున్నాడు విశ్వక్ సేన్. ఇలాంటి సినిమా చేసినందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ ఓ లెటర్ విడుదల చేశాడు.

‘ నమస్తే.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ - నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి - హృదయపూర్వక క్షమాపణలు..’ అంటూ కొనసాగిందీ ఓపెన్ లెటర్. మరి ఇకనైనా విమర్శలు ఆగుతాయేమో చూడాలి.

Tags

Next Story